ఆఖరి బిందువు

నిన్న నాది కాదు...
అది గతించిపోయింది
రేపు నాది అవునో కాదో...
అది నిర్ణయింప బడలేదు
నేడు నాదే! కానీ...
కొన్ని క్షణాలలో...
కాకుండా పోతుంది!
ఈ క్షణం నేనున్నదే నాది!
కాలం ఎప్పుడూ నాది కాదు!
క్షణానికో బిందువుగా
జారిపోతూ ఉంటుంది!
ఎన్ని బిందువులు మిగిలాయో
ఏ మాత్రం తెలియదు!
ఆఖరి బిందువు వరకూ...
అంతా నాదే అనిపిస్తుంది!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు