దీపశిఖ
చీకటిలో వెలిగే చిరుదీపమా
చిరుగాలికి నీ పై పరిహాసమా
నీ రెపరెపలను చూసి
నిన్ను నిలకడ చేయాలని
అరచేతుల మధ్య నీకు
రక్షణనివ్వాలని తపియించే
హృదయంతో నీ దరి చేరే లోపు
ఎన్నెన్నో అలజడులు
నిన్నార్పి వేయునంతగా...
నీ ప్రమిదెను తైలం
నిండుగ నే నింపిననూ...
ఈ గాలిని అనుక్షణం
నేనెలా ఆపగలను!
నీవుండే చోటు నీకు
క్షేమము కాదింక...!
చేరుము నా గూటిలోకి
వెలుగుము ఓ దీపశిఖ...!
Comments
Post a Comment