కలకంటి కన్నీరొలికెను
కలకంటి కన్నీరొలికెను!!
కలకంటి కన్నీరొలికెను!!
ఇంటి పేరే సాక్షిగా...
తన గుండె గాయం సాక్షిగా
అత్త మామలు గుచ్చు తీరు!
ఆడపడుచులు పొడుచు తీరు!
చెవిన చెప్పుడు మాట వింటూ
రెచ్చిపోయే భర్త పోరు!
చిన్ననాటి కలలు అన్నీ
చిట్టి తాళితొ చెదరిపోతే...
పుట్టినింటికి భారమైతే...
మెట్టినింటికి లోకువైతే...
తట్టుకోలేనంత బాధను
ఎట్టులో మరి నెట్టుకొస్తే...
వనిత వనితకు శతృవైతే...
తాళి నాగై కాటు వేస్తే...
ఓదార్పు నీయని
ఇరుగు పొరుగులు
చాటుగా మాటాడుకుంటే...
కలకంటి కన్నీరొలికెను!!
కలకంటి కన్నీరొలికెను!!
Comments
Post a Comment