మనో నేత్రం
దర్పణమా నీ దర్పమిక చాలు!
నీవు కేవలం నీ ఎదుట
నిల్చినదానినే ప్రతిబింబిస్తావ్!
దృశ్య కటకమా నీ పొగరు ఇక చాలు!
నీవు కేవలం నీ నుండి
చూసిన దానినే చూపగలవు!
నేత్ర ద్వయమా మీ తళుకులిక చాలు!
మీరు చూసిన దానినే మాచే
నమ్మించి భ్రమింప జేస్తారు!!
ఓ దైవమా! నీవిచ్చిన మనో నేత్రం
ఈ సృష్టిలోనే గొప్పది!
అది గతాన్ని వీక్షిస్తుంది!
వర్తమానాన్ని పరశీలిస్తుంది!
భవిష్యత్తుని ఆవిష్కరిస్తుంది!
లేని దృశ్యాలను కూడా
ఊహలుగా, స్వప్నాలుగా
మనో ఫలకంపై ముద్రిస్తుంది!
ఇంతకు మించిన
జ్ఞాన నేత్రం మాత్రం
నీవు మాకు ఈయక
నీ వద్దనే ఉంచుకున్నావు!
దానిని పొందే శక్తి హీనులము
మేమని నాకు తెలుసులే!!
Comments
Post a Comment