కొత్త కవిత
ఒకటే ఆట ఒకటే పాట
ఒకటే మాట ఒకటే తోట
చూడాలన్నా వినాలి అన్నా
ఒకటే రంగుని వాడాలన్నా
ఒకటే చోటను ఉండాలన్నా
ఒకటే వంటను తినాలి అన్నా
ఒకటే కధలను వినాలి అన్నా
ఒకటే కవితలు చదవాలన్నా
బోరు కొట్టదా ఎవ్వరికైనా
నిద్రపట్టదా ఎంతటిదైనా
కవిత కవిత కీ మార్పుండాలని
కోరుకునే ఓ కవి బాలుడిగా
కొత్తగ ఏదో రాయాలంటూ
ఒకటే వాదం చేస్తూ ఉంటా!!
Comments
Post a Comment