సహస్ర కవులు
సహస్ర కవులు విచ్చేసారు
స్వహస్తాల వ్రాస్తున్నారు
ప్రణయ గీత మలయమారుతం
ప్రళయ కాల విలయతాండవం
అక్షరాల వినిపించేందుకు
సహస్ర కవులు విచ్చేసారు
స్వహస్తాల వ్రాస్తున్నారు
అణగారిణ పీడిత వర్గం
అమరేందృని అనితర స్వర్గం
నిరుపేదల ఆకలి కేకలు
స్రీమంతుల ఆటలు పాటలు
వర్ణనలో వినిపించేందుకు
సహస్ర కవులు విచ్చేసారు!
స్వహస్తాల వ్రాస్తున్నారు!
అంతరంగ ఆత్మ సాక్షిని
అంతులేని అవినీతి జగతిని
ఆధ్యాత్మిక విశేషాలని
ప్రభంధాల విశ్లేషణని
భక్తి ముక్తి యోగ ఫలముని
శక్తి యుక్తి సేవ గుణముని
వివరంగా వినిపించేందుకు
సహస్ర కవులు విచ్చేసారు!
స్వహస్తాల వ్రాస్తున్నారు!!
Comments
Post a Comment