సిరుల లక్ష్మీ రూపిణి
చిలక పలుకుల కలికి
సింగారమై నడిచిందిలే!
సిగ్గు మొగ్గలు పూచి
బుగ్గలు మందార
కాంతులు చిందెలే!
కళ్యాణ వేదిక దారిన
సన్నాయి మేళపు తోడున
తళుకులొలికే చీర చెంగును
వడ్డాణమునకు ముడియ గట్టి
పూలు కొబ్బరి తమలపాకుల
వెండి పళ్ళెం చేత బట్టి
గౌరిపూజకు తరలి వచ్చే
సిరుల లక్ష్మీ రూపిణై!!
Comments
Post a Comment