పంక్తిలో ఒకనిగా
భక్తి పాడగలేను రక్తి వీడగలేను
ముక్తి మార్గమునందు నడచిపోలేను
వ్యక్తిగా నాలోని వ్యక్తిత్వమును జూపి
వ్యక్తీకరించగల ఘనుడనే కాను!
యుక్తితో నాకున్న శక్తితో తగినంత
భుక్తి గడవగ బ్రతికినాను.
సూక్తి ముక్తావళులు వినెడి ఆసక్తియే
పంక్తి లో ఒకనిగా నిలువనిచ్చింది!
Comments
Post a Comment