సిగ్గుచేటు
మానవత్వం ఏమయిందో
అన్నదాత రైతు పాలిట!!
ఎండలకీ వానలకీ
కష్టాలకీ నష్టాలకీ
పేదరికపు వెక్కిరింతలకీ ఓర్చి
పట్టెడు దుఃఖాన్ని దిగమిగి
పుట్టెడు ఆశలను గుండె నింపుకుని
పండిన పంటను పట్నం
తీసుకువచ్చి... మార్కెట్ యార్డే
తన బతుకుకి బరియల్ యార్డు
అవుతుందని ఎరుగని
ఆ అమాయక రైతు...
ఎండకు మాడి, చెమటకు తడిసి
డొక్కలు ఎండి, నీడే కరువై
దురహంకారుల నిర్లక్ష్యానికి
అలసీ సొలసీ అశువులు బాసితె...
మానవత్వమే ఏమయ్యిందో
అన్నదాత రైతు పాలిట!
తను తెచ్చుకున్న పంట పైనే
తనువు చాలించిన దుస్థితి...!!
సిగ్గు చేటు కాదా ...!!
ఈ సభ్య సమాజానికి...!!
Comments
Post a Comment