సంచి బరువు
పదికి నాలుగు నిమ్మకాయలు!
ఇరవైకి రెండు అరటి కాయలు!
చేతిలో పది నోటు పెడితే
మూడు కట్టలు కొత్తిమీర!
బజారు చుట్టూ తిరిగి చూస్తే
దొండకాయే చౌకగున్నది!
తీసుకెళ్ళిన సంచి పెద్దది!
కొన్న కూరల సంఖ్య చిన్నది!
పరసు మాత్రం ఖాళీ అయినది!
వెరసి కష్టమె దక్కినాది!!
Comments
Post a Comment