ఇనుము - మినుము
ఇనప గుళ్ళ వంటి
మినప గుళ్ళుండగా
ఇంగ్లీషు ఫుడ్డంటు ఏడుపేల!
మినప పుణుకులు వదలి
మంచూరియా అంటు
చైనీసు తిండికై మోజు ఏల!
మినప పిండితొ చేయు
ఇడ్లీలు కుడుములకు
నార్తు ఫుడ్డు కూడ
సాటిరాదు!
మినప గారిలోన
మిర్చి దంచివేసి
నువ్వుల చెట్నీతొ
నంచుకుని తినిచూడు!
కారంపు పొడిలోన
అద్దుకుని తినిచూడు!
అబ్బబ్బ ఏమి రుచి!
అంటావు మైమరచి!
మినప రొట్టె ముందు
పిజ్జాలు దిగతుడుపు
మినప అట్టులుంటె
సాండ్వట్చులెందుకు
మినుము ఇనుమేనురా
వంటకీ - వంటికీ
విపులమగు నా మాట
వినుర రామ!
Comments
Post a Comment