బానిస బతుకులు
పొగ తాగకురా చస్తావ్!
అని చదువుకుంటూనే
గుప్పు గుప్పు మని
పొగ పీల్చి వదిలే
పొగరాయుళ్ళు...
మద్యపానం జీవితాన్ని
నాశనం చేస్తుందని తెలిసినా
చిత్తు చిత్తుగా తాగి
మత్తులో బతికే
మందు బాబులు...
చావంటే భయం లేని
ధైర్యవంతులు కాదు!
బానిస శృంఖలాలలో
బందీలైన వ్యసనపరులు!
ఇంకానా బానిస బతుకెన్నాళ్ళని
ప్రశ్నించే విప్లవ కవులూ
ఆరోగ్యం మహా భాగ్యమని చెప్పే
వైద్యులూ, ఉపాధ్యాయూలూ
ఎందరో ఎందరెందరో
ఈ సంకెళ్ళలో బందీలే!!
Comments
Post a Comment