నానీలు - 5
ప్రేమ కోసం
జీవిస్తాడట
సిగరెట్ల కోసం
పడి చస్తాడట
ధూమపానం
వద్దన్నాను
అతడి మనోభావం
దెబ్బతింది
తండ్రిని మించిన
కొడుకులు
ధూమపాన
విశారదులు
వైద్యం చెయ్యడం
అతని వృత్తి
పొగతాగడం
మాత్రం ప్రవృత్తి
సిగరెట్టు ఖరీదు
లెక్క కడతాడు
ప్రాణం లెక్క
మర్చిపోతాడు
Comments
Post a Comment