పరమ సోపానం
గంపెడూ కోరికలు
తలపైకి ఎత్తుకుని
గతపాప కర్మలను
చంకలో పెట్టకుని
గంగ మునుగంగనే
పాపహరణము కాదు
గంగ సుతుడై కూడ
ఫలమనుభవించెను
కర్మబంధాలలో
బంధీవి అయినావు!
నిష్కల్మషము తోడ
కొలువు దైవమును
పశ్చాత్తాపమే...
పరమ సోపానము
దేవతారాధనకు
అదియె నైవేద్యం!!
Comments
Post a Comment