ఆదిమ పడతి
తాగే గుక్కెడు నీటి కోసం
తండాలు తరలి వెళ్తున్నాయ్!
చల్లని రవంత నీడ కోసం
పల్లాలకు పరిగెడుతున్నాయ్!
కడుపున అగ్నికి అన్నం కోసం
కదలి కదలి పోతున్నాయ్!
నగరంలో లేదు రక్షణ
పల్లెల్లో లేదు పోషణ
అడవి తల్లి వడిలో చేరి
కోనలమ్మ పదముల జేరి
తమ బిడ్డల నాదుకొమ్మని
వేడుకొంది ఆదిమ పడతి!!
Comments
Post a Comment