దేవత
కోడి కూసేవేళ
లేచి లేవంగానె
దొడ్లు వాకిలి తుడిచి
కళ్ళాబులను జల్లి
ముగ్గు ముంగిట వేసి
గదులు శుభ్రం చేసి
అంట్లగిన్నెలు తోమి
తేయాకు పాలను
తీయగా అందించి
కంపు గుడ్డలు అన్ని
ఉతికి జాడించేసి
మూడు పూటల వంగి
వంట వార్పులు జేసి
గృహజనుల మేలు కై
తను పూజలను చేసి
ఇల్లు దిద్దుట కొరకు
తను కొలువు మానేసి
భర్త సుస్తి జేస్తె
తను తినుట మానేసి
బిడ్డల సుఖము కై
తన సుఖము వదిలేసి
అలిసి పోయన గాని
తెలిసిపోనివ్వక
ఓర్మితో నడిచేటి
త్యాగమూరితి మాత
భరత నారీమాత
తల్లి దేవత కాద ధరణి లోన!!
Comments
Post a Comment