కవితా సంపద
భాషకు పదాలు ఎన్నున్నా
భావానికి చెందేవి కొన్నే!
భావాన్ని విడిచి వాడిన పదాలు...
రసంలేని ఫలాలేగా!
కదిలించేది - కరిగించేది కవిత్వం
రవళించేది - రగిలించేది కవిత్వం
ప్రజాపధంలో పనికొచ్చేది...
ప్రయోజనాలను చేకూర్చేది కవిత్వం
కలకాలం నిలిచే కవిత్వమే
కవితా సంపద అనిపించునుగా!
Comments
Post a Comment