వెలుగు దీవెనలు
సూర్యుడు ఉదయించే సమయం
కొమ్మపై పక్షుల కువకువలు
గుడిశలో పిల్లల కిలకలలు
కోడి కొక్కొరొకో అంది
కొవ్వు కరగాలి పరుగెత్తమని
అలారం గణగణ మంది
వళ్ళు విరుచుకుని లేస్తుంటే
మంచం కిర్ కిర్ మంది
పడుక్కోరా! ఏమెళ్తావ్!
అంటూ మనసు గుసగుస మంది
ఇంటి ముంగిట ముగ్గు వేసేందుకు
చీపురుతో ఊడ్చే శబ్ధం
నా నిద్రమత్తునీ ఊడ్చేసింది
కిటికీలోంచి లేత బంగరు కిరణం...
కళ్ళల్లో పడుతూ ఉంది...
నా బ్రతుకును బంగారం చేసుకొమ్మని!!
వెలుగు దీవెనలిస్తోంది!!
Comments
Post a Comment