విశ్రమ విప్లవం
రైతాంగ మొక్కటై
నారు వెయ్యకపోత
పూటపని కూలీలు
వెట్టి పనులొదిలేస్తె
పాడి పని కార్మికులు
వేరు పని మొదలెడితె
పాలేరులందరూ
పనిని విశ్రమిస్తె
కుమ్మరులు,
కమ్మరులు,
మంగలులు,
చాకలులు,
తిరుగు చక్రాలన్ని
తిరగడం మానేస్తె
కరుగు కండలు అన్ని
కరగడం ఆపేస్తె
మరుగు రక్తం నిన్ను
విడిచి వేరుగ పోతె
ధనికుడా నీ ధనము
పరుల సొత్తవ్వదా!
అధికుడా నీ చెమట
చింది చెరువ్వదా!!
Comments
Post a Comment