దశావతారుడు దాసరి
పామరుల పాట నీదే
పండితుల మాట నీదే
చిత్రలోక సూర్యుడు నీవే
ఛాయాగ్రహ శక్తివి నీవే
మహా నటుల సాంగత్యంలో
మంచి నటుడివయ్యావు
మరి ఎందరో తారలకు
చంద్రుడిగా తోడయ్యావు
అక్కినేనినభిషేకించి
నందమూరినభిమానించి
బొబ్బులిపులి తీసిన వాడివి
బెబ్బులిలా బ్రతికిన వాడివి
సామాజిక పాత్రలనెన్నో
కధనంలో నిలిపిన వాడవు
రత్నాలను అందించి
దర్శక రత్నం గా ఎదిగావు!
దశావతారాలెత్తిన
దాసరి నారాయణుడవు నీవు!
Comments
Post a Comment