జీవిత పాఠం
నా జీవితంలో ఎందరో!
ఎందరినో కలిసాను!
ప్రేమను పంచిన వాళ్ళను
ప్రేమను తృంచిన వాళ్ళను
ప్రేమ జయించిన వాళ్ళను
ప్రేమ త్యజించిన వాళ్ళను
విరహంలో బతికిన వాళ్ళను
విరహాగ్నిన తోసిన వాళ్ళను
ఎందరినో కలిసాను!
గెలుపు కొరకు నిలిచిన వాళ్ళను
ఓటమికై వెరచిన వాళ్ళను
భయమంటే ఎరగని వాళ్ళను
భయపడుతూ చచ్చే వాళ్ళను
నవ్వులలో ముంచే వాళ్ళను
ఏడుస్తూ గడిపే వాళ్ళను
ఉత్సాహం చూపే వాళ్ళను
నీరుగారి పోయేవాళ్ళను
నీరసించి పోయిన వాళ్ళను
ఎందరినో చూసాను!
నే చూసిన మనుషుల నుండి
నే నేర్చిన ప్రతి పాఠాన్ని
వివరంగా లిఖించుకున్నా
విశదంగా పఠించుచున్నా!!
Comments
Post a Comment