అభినందనలు
అభినందించే వారికి
అభివందనాలు
అభినందించలేని వారికి
అభినందనలు!
అభిమానించే వారికి
అభిషేకములు!
అభిముఖమైన వారికి
అభివాదములు!
అభిప్రాయ బేధాలెన్ని ఉన్నా!
అభినయం చూపే వారికి
అభిలాష ఫల సిధ్ధులు!
అభినివేశం ఉన్న అందరికీ
అభిరాముని నీరాజనాలు!!
Comments
Post a Comment