వైరస్
బట్టలు తొడిగిన పందికొక్కులు
బొక్కేస్తున్నాయ్ ధనధాన్యాలు!
నక్కల మాదిరి నక్కుతు ఉంటూ
ఎత్తులు, జిత్తులు వేస్తూ ఉంటూ
జనారణ్య జాతుల మధ్యన
విభేదాలు పుట్టిస్తుంటూ
ధ్వంస రచన చేస్తున్నారు
హింస తాళమేస్తున్నారు
జాలి వంటి జలాశయాలు
కరుణ వంటి నదీ నదాలు
చాలానే చూపిస్తారు!!
నమ్మి ముందుకెళ్ళామంటే
నలువైపుల ఇసుక ఎడారే!
పూలన్నీ తెంపుకు పోయి
ముళ్ళు మనకు మిగులుస్తారు!!
మొక్కలుగా వదిలామా
మానులుగా ఎదిగేస్తారు!
చుట్టూతా చొచ్చుకు పోయి
వేళ్ళు తన్ని నిలబడతారు!!
ప్రజాస్వామ్య వాయువులోన
వ్యాపించిన వైరస్ వీళ్ళు!!
Comments
Post a Comment