మేళవింతువ చెలీ

రాగి అంబలి తాగి
రాటుదేలిన గొంతు
రాగాలు పాడితే
విందువా చెలియా!

కాడె గిత్తల గట్టి
నాగళ్ళ పిడి పట్టి
కందినా చేతులతొ
డోలు వాయిస్తేను
నీ కలువ చేతులతొ
తాళమేస్తువ సఖియ!

పలుగు పారా బట్టి
కాయగాసిన వేళ్ళ
వెదురు వేణువు బట్టి
రాగాలు ఊదితే
వీనులా విందుగా
విందువా చెలియా!

మట్టి మన్నూ తొక్కు
కాళ్ళ గజ్జెలు కట్టి
జాతరలో నేనొచ్చి ఆడితే సఖియా
మోచేతి గాజుల సవ్వడీ
జత జేసి మేళవింతువ చెలీ
నీ మేటి నాట్యముతో!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు