అలక్ష్యం
నీ తల్లిపై నువ్వు
నరాలు బిగిస్తున్నపుడు...
నా నరాలలో రక్తం
మరుగుతోందెందుకో!
నీ తల్లిని నువ్వు
అలక్ష్యం చేస్తున్నప్పడు
నీపై నాలో కోపం
కట్టలు తెగుతుందెందుకో!
నీ తల్లిని నువ్వు
బూతులు తిడుతున్నప్పుడు
నాలుక చీరెయ్యాలని
నాకు అనిపిస్తుందెందుకో!
తినే కంచం నువు
నేలకేసి కొట్టేటప్పుడు
నిన్ను నేలలో పాతెయ్యాలని
అనిపిస్తుంది ఎందుకో!
అయినా నిన్ను ఏమీ చేయను!
నీ తల్లి గుండె బాధ పడుతుందని!!
Comments
Post a Comment