నానీలు - రైతు జీవితం

1. విత్తుని పండించడం
    తెలుసు గానీ...
    విత్తం పండిచడం
    తెలియదే!!
     
2  వ్యవసాయం
    చేసి ఇస్తాడు
    వ్యయ సాయం
    ఎవరిస్తారు!!

3.  మేఘం
     వర్షించక పోతే
     తానే వర్షిస్తాడు
     కన్నీటి మేఘమై!!

4   ఆకలి తీరుస్తాడు
     పంటలు వేసి..
     హారతి ఔతాడు
     అప్పులు చేసి!!

5   భాగ్యం పండించి
     ఇచ్చినా గానీ...
     రైతు బ్రతుకు
     దుర్భాగ్యమేనా!!
     

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు