మన మౌనం
భార్యాభర్తల నడుమ...
మౌనం అహంకారం
తల్లీ పిల్లల నడుమ...
మౌనం అసాధారణం
అపరిచయస్తుల మధ్య...
మౌనం అలంకారం
ఉపన్యాస వేదిక ఎదుట...
మౌనం అవసరం
తగని ప్రశ్నలెదురైతే...
మౌనం అత్యవసరం
భార్య చిరాకు పడుచున్నప్పుడు...
మౌనం అత్యంత అవసరం
వైద్యుడి ముందు రోగి...
మౌనం అనవసరం
గురువుముందు సందేహలకు...
మౌనం అనవసరం
అప్పిచ్చువాని ముందు...
మౌనం అనవసరం
అప్పడుగు వానిముందు...
మౌనం అవసరం
అభినందించాల్సిన వేళ
మోనం ఒక రోగం!!
ధ్యానం చేయాల్సిన వేళ
మౌనం ఒక యోగం!!
Comments
Post a Comment