గొప్పదనం సత్యం వీక్షిస్తుంది!
గొప్పదనం చెప్పుకుంటే రాదు
గొప్పదనం చెప్పించుకుంటే రాదు
గొప్ప కోసం చేస్తే రాదు
గొప్పదనం నటిస్తే రాదు
వ్యక్తిత్వాన్ని వికసింప జేసుకుంటే...
ఆత్మ ప్రబోధానికి కట్టుబడి ఉంటే...
అసమానతలు అంటకుండా ఉంటే...
త్యాగనిరతి కలిగి ఉంటే...
వెనుకడుగు వేయకుండా ఉంటే...
ప్రతిభ ప్రదర్శించకుండానే...
దర్శింపబడుతుంది!!
ధనబలంతో పరివారబలంతో
జరిపించుకునే సత్కారాలు
సామాన్యుడు వీక్షించినా...
సత్యం వీక్షించదు!!
సత్యాన్ని నేత్ర త్రయంగా కల్గిన
నిటలాక్షుడు వీక్షించడు!!
Comments
Post a Comment