నల్ల గురివిందలు
నాయకులై వచ్చెలే నల్ల గురివిందలు!
నల్ల డబ్బుకు తెరలు లేపి అరవిందలు!
ఒకరిపై ఒకరెత్తి వేలు చూపిస్తారు!
ఒక్కరూ దోషులని ఒప్పుకోబోరు!
అందరూ వెజ్జులే చేపలేమైపోయె!
ఎవ్వరూ దోచనిదె ధనము ఏమాయె!
నాయకులై వచ్చెలే నల్ల గురివిందలూ
నల్ల డబ్బుకు తెరలు లేపి అరవిందలు
Comments
Post a Comment