వెలివేత సరియగున
గాడి తప్పిన రైలు
పక్క దారులు పట్టి
పడిపోయినా గాని...
పట్టాల పై జేర్చి
నిలబెట్టమా...!
గాడి తప్పిన మనిషి
తప్పు దారుల పడితె
నిందించి... శిక్షించి...
వెలివేసినట్లుంచి...
దూరమౌదుము గాని
ఆదరించెదమా...!
సంఘజీవనమందు
వెలివేత సరియగున
భయము నయములు జూపి
బ్రతుకు సరిచేయమా...!
Comments
Post a Comment