మరణ బాధ
అమ్మ చెప్తే వినదు
అత్త మాటే పడదు
మొగుని సేవను గనదు
మామ ఉనికే మనదు
వేరు కుంపటి కోరి
వేరు పురుగై దొలుచు
కోడలి పంతమే కొంపకెసరు!!
కూతురి కాపురం
వెలుగు కోరే తల్లి
కోడలి తీరువను
దెప్పుతూ ఉంటేను
సుఖమెక్కడుండు
ఆ కొడుకు సంసారము!!
ఆలి తల్లుల తగవు
తన తలకు భారము!!
కొడుకు మాటే మరచి
అల్లుని అతి గౌరవించి
మర్యాదలు పంచుటలో
తమ తాహతు పరిధి మించి
చివరకు అప్పుల భారం
తలకు చుట్టుకున్నప్పుడు
అయిన వారు ఎవ్వరూ
కలసిరాక పోయినపుడు
ఆ తండ్రి పడే మరణ బాధ
వర్ణనకే అందదు గా!
Comments
Post a Comment