వెంకటేశ్వర దండకం

నమో వెంకటేశా! నమో శ్రీనివాసా!
నమో తిరుమలేశా! నమో కలియుగేశా!

మా వెతల్ దీర్చి పాలించి
పాపాలు హరియించి
కరుణన్ మొరాలించి బ్రోవంగ రావే!
దేవా....!

కౄరులున్ చోరులున్
వైరులున్ భీరులున్
వక్రమార్గంబునన్
అక్రమార్కంబుగన్
ఉగ్రవాదంబుగన్
చాటుగన్ మాటుగన్
దాడులంజేసి ఆ దానవుల్మించి
జనుల హతమార్చి
భయభ్రాంతులం జేసినారే!

ఆ కొండ నీఉండి
మా అండ రాకుండ
మౌనం వహించావేమి దేవా!

పూజలన్ పొందుచున్
ఊయలన్ ఊగుచున్
లక్ష్మీ విలాసుండవై
చిద్విలాసుండవై
పృధ్వికాంతుండవై
పద్మనాధుండవై
మా గోడు ఆలించి
నిశ్చింతగా ఎంచి
శయనింతువేలయ్య స్వామీ..!

నిస్పృహన్, నిత్యమున్
అశృ నయనాలతో
ఆత్మ క్షోభించుచూ
నిన్ను కీర్తించుచూ
కర్షకుల కష్టముల్ నష్టముల్
తొలగించి తొలిపొద్దు పై నాశ
చిగురింప కటాక్షించవా!
ప్రభో..! దేవా..!
లక్ష్మీ నివాసా..!
పాహిమాం! పాహిమాం!
పాహి! పాహి!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు