స్వేచ్ఛ కోసం
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకై
పోరాడే మనిషీ!
స్వేచ్ఛ నీ ఒక్కరికే స్వంతమా?
ఈ మత్స్య లోకం లో అన్ని జీవులకూ
నీ వలె ప్రాణం ఉంది!
నీ వలె ఆకలి ఉంది!
నీ వలె దప్పిక ఉంది!
నీ వలె బ్రతకాలని ఆశ ఉంది!
మరి నిరంతరం నీవు
వాటి స్వేచ్ఛను హరిస్తావే!
వాటి ప్రాణాలను తృణప్రాయంగా
తీసి నీ ఆకలి అగ్ని కుండంలోకి
సమిధలుగా వేస్తావే!
నీకు అనపించదా?
వాటికి కూడా నీవలె
స్వేచ్ఛా స్వాతంత్రయాలు కావాలని!!
బలమున్నవాడికే
బ్రతికే హక్కు ఉండాలనే
ఆటవిక సంస్కృతిని
అక్షరాలా అమలు చేసే మనిషీ!
స్వేచ్ఛ కోసం ఇక నీకు
పోరాడే నైతిక హక్కు ఎక్కడిది??
Comments
Post a Comment