పొగాకు చేసే మాయాజాలం
పొగచేసే మాయాజాలం
వినరండీ వినరండీ!
తగలేసే పెట్టెల సాక్షిగ
చేబుతామరి ఈ పూట!!
గాలిలోకి ఎగరేసి
నోటితోటి అందుకుని
ఒక గీటుతోటె వెలిగించే
చలాకీల క్రీడాజాలం!
అర ముక్కను విరిచి కాల్చడం
ఒకరిద్దరి స్టైలైతే
అటూ ఇటూ తిప్పి కాల్తడం
మరికొంది ఇస్టైలు!
రింగు రింగులుగ
సుడులు తిప్పుతూ
పోజులిచ్చే ఆనందంలో
పొగ పామై చుట్టుకుందని
తెలియని ఓ మాయాజాలం!
చుట్టుకున్న పొగపాము
కాటుమీద కాటేస్తుంటే
తట్టుకుంటూ తిట్టుకుంటూ
వదలలేని బానిసతనంతో
బ్రతికే ఓ మాయాజాలం!
పొగ చేసే మాయాజాలం!
కడదాకా మనిషిని పట్టి
కాటికతడు చేరకముందే
కార్చిచ్చుగ లోపల దూరి
కాల్చేసే మాయాజాలం!!
కడతేర్చే మాయాజాలం!!
ఇదేనండి! ఇదే ఇదే!
పొగాకు చేసే మాయాజాలం!!
Comments
Post a Comment