కవితా సంద్రం

కవిత్వమా...!
నీవొక మహా సముద్రానివి!
సముద్రపు కెరటాల్లా
నీవు ఎగసి పడుతూనే ఉంటావ్!
హృదయ తీరం చేరి
మమ్ము నీలోనికి
లాగుతునే ఉంటావ్!
సంద్రంలా లోతు గ ఉంటావ్!
నిండు గర్భినిలా కవితలు
కంటూనే ఉంటావ్!
నీ పురిటి నొప్పులే
మాలో భావావేశాలై
పండంటి ఓ కవితకు
జన్మనిస్తాయి!!
కడలి జల బిందవుల్లా
నీలోని పద బిందువులకు
అంతేలేదు!!
అందుకే మేము రోజూ
నీ తీరం చేరి సేదదీరుతాం!!
తోడుకున్నవారికి తోడుకున్నంత
కవన సంపదనిచ్చే
అనంత విశాల విరించి
విశారదవు నీవు!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు