రక్త మేఘం
రక్తపాతం జరుగోతోంది
రాజ్యాల ఎల్లలకోసం
రక్తపాతం జరుగుతోంది
రాజ్యాధికారం కోసం
రక్తపాతం జరుగుతోంది
మతాల మనుగడ కోసం
రక్తపాతం జరుగుతోంది
కుల ఆధిపత్యం కోసం
రక్తపాతం జరుగుతోంది
ప్రపంచీకరణ కుటిలత కోసం
విశ్వశాంతి శవమై తేలి
కొట్టుకుంటూ పోతోంది
ప్రవహించే హింసానదిలో
ప్రతీకార వరదల వడిలో
జవానులూ, ఉగ్రవాదులూ,
పోలీసులు, నక్సల్ వాదులు,
మాఫియాలు, ఫ్యాక్షన్ దొరలు,
రణపిపాస మత రాజ్యాలు
ఆడుతున్న రుధిర క్రీడ ఇది!!
ఆరని చితి మంటల సాక్షిగా
ఆగని ఉత్పాతమిది!!
కలి పురుషుని విజృంభనలో
కదులుతున్న రక్తమేఘమిది!!
Comments
Post a Comment