ఓ మధువా
ఓ మధువా! నీకు జోహార్లు!
తాగేవాడికి తలలో దూరి
తతంగమంతా నడిపిస్తావు!
ఓ మధువా! నీకు జోహార్లు!
వాగేవాడికి నాలుక తిప్పి
పచ్చి నిజాలు పలికిస్తావు!
ఓ మధువా! నీకు జోహార్లు!
చావుకు భయపడి చచ్చే వాళ్ళకు
చావును చూబిస్తావు!
ఓ మధువా! నీకు జోహార్లు
మదమత్తుల జేబుకు చిల్లులు పెడుతూ
కొంపలు కూల్చెస్తావు!
కానీ.....
ఓ మధువా! మరి ఇక చాలు!
సామాన్యుల బతుకులు ఛిద్రంచేసే
నీ నీచపు పాశపు అరాచకాలు!
ఓ మధువా! మరి ఇక చాలు!
నీ సేవనలో తరియించెడు దుర్గతి
మా జనులకు మరి ఇక చాలు!
Comments
Post a Comment