ఛీ! ఎదవ బతుకని!
#Digital #Life
ఛీ! ఎదవ బతుకని! ఎదవ బతుకని!
తెల్లారి లేచింది మొదలు చేతిలో సెల్ ఫోనూ, వళ్ళో లాప్టాపు! కంచం కాడ అదే! మంచం కాడ అదే! ఎవడైనా ఇంటికొస్తే మాటా మంతీ ఉండదు! మధ్యలో TV ఒకటి ! ఇక ఏ ముచ్చటైనా వీటితోటే! దేశ జనాభా సగానికి పడిపోద్ది! నా చిన్నప్పుడెంత బాగుండేది! నలుగురితో నవ్వులూ... ఆటా... పాట... ఎవరికైనా బంధువుకి విషయం చెప్పాలంటే పోస్టుకార్డు మీద రాసి డబ్బా లో వెయ్యాలి! లక్కీగా అది వాడికి చేరితే వాడు రాసిన రిప్లై కార్డు మనకు చేరే వరకు వెయిట్ చయ్యాలి! విరహంలో లో ఉన్న మధురం ఏం తెలుసు ఈ కాలం జనానికి! టెలిగ్రాము వస్తే ఇంట్లో ఆడోళ్ళ ఏడుపు! ఆ సీన్లు ఇప్పుడుంటాయా! ఒక సస్పెన్స్ లేదూ పాడూ లేదు! ఎదవ జీవితం! నాకు తెలిసి ఈ మధ్య కాలంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్నదే సస్పెన్సు! అయ్యో tv సిరియల్స్ మర్చిపోయా! ఈ మధ్య కొంచెం తగ్గింది గానీ లేదంటే సాయంత్రం అయ్యిందంటే శోక సాగరాలే!
తిరగలి విసురుతూ, చింతగింజలు వలుస్తూ, వడియాలు పెట్టుకుంటూ ఆడోళ్ళు చెప్పుకునే ముచ్చట్లే ఇక లేవు! మన మధ్య డిజిటల్ గోడలు కట్టబడ్డాయి! ఇక నేచురల్ గా బతకడం కష్టమే!!
Comments
Post a Comment