బిజీ బిజీ
టైములేదండీ! బిజీ బిజీ!
కవితలు చదివే తీరిక లేదు!
రాసే టైము అసలే లేదు!
సినిమాకా? అబ్బే! నో టైమ్ అండీ!
ఎప్పడైనా వీలుంటే టివి లో చూస్తా!
పిల్లలతో బిజీనా! నోనో!
మా పిల్లలకి అన్నం
మా అమ్మ పెడుతుంది
స్కూలు సంగతి
మా నాన్న చూసుకుంటారు
అవన్నీ చూసుకునే టైమెక్కడిదండీ!
ఆఫీసా! అహహ్హా!
నాకు ఉద్యోగం చేసుకునే
టైమెక్కడిదండీ!
ఆ పని మా ఆవిడ చేస్తుంది.
బిజినస్సా!! అది మనకి అచ్చిరాదు
అయినా అంత టైము లేదు!
ఏం చేస్తుంటాననే కదా మీ సందేహం?
దారిన పోయే వారికి సలహాలిస్తుంటాను!
అడిగిన వారికి, అడగనివారికి
ఆధ్యాత్మిక విషయాలు బోధిస్తాను!
మనిషి ప్రశాంతంగా బ్రతకడానికి
టిప్స్ చెబుతుంటాను ఫ్రీగా!!
నా ప్రవచనాల కోసం
జనం వెర్రెక్కి పోతుంటారు!
నాకు క్షణం తీరికలేకుండా
ప్రొగ్రామ్స్ బుక్కవుతాయి.
బయట నాకు బ్రహ్మరథం
పడతారు జనం!
కానీ ఇంట్లోనే నాకు వ్యతిరేకం!
ఎవరూ నా మాట వినరు!!
వాళ్ళకి నేను టైమివ్వటం లేదని
పీకలదాకా కోపం!!
Comments
Post a Comment