దగా పడ్డ సోదరులారా!
దగా పడ్డ సోదరులారా!
దిగాలు పడి కూర్చున్నారా!
శ్రమదోపిడి జరుగుతు ఉన్నా
శ్రామికమిక నలుగుతు ఉన్నా
జాలిపడే జననాయకులు
జాతికి ఇక రారనుకుంటూ!
కలసివచ్చు ప్రజాప్రభుత్వం
కనుచూపున లేదనుకుంటూ!
మీ కష్టం కాకుల పాలై
మీ కలలు చికాకుల పాలై
మీ నీడలు భయపెడుతుంటే
మీ గోడలు కూలుతు ఉంటే
మీ వేదన అరణ్య రోదన!
మీ మౌనం కడు నిశ్శబ్ధం!
సమాజ గతి మారుతు ఉన్నా
శ్రామిక రథ చక్రము సున్నా!
అని దిగులుగ కూర్చున్నారా!
సంఘటితముకు తెరవేశారా!
కార్మికులకు దినము కాదిది!
కర్మవీర జయంతి నేడిది!
అలసత్వం వీడిననాడే
ఆగుతుంది అసలు దోపిడి!
ప్రశ్నించుట మొదలిడితేనే
నిలుస్తుంది నిలువు దోపిడీ!!
#MayDay
Comments
Post a Comment