సాధింతు పరిపూర్ణ ప్రాభవమ్ము
పారిపో చీకటీ పారిపో!
ఉదయ భానుడు నా
హృదిన ఉదయించినాడు!
పిరికితనమా నవ్వు చెరిగిపో
ధైర్య లక్ష్మి నా యద కొలువు తీరింది!
ఓటమీ నీవింక తొలగిపో
విజయ దుంధుభి నేను మ్రోగించుచున్నాను!
నాలోని లోభ మద మత్సరములార!
మీ చేటు కాలమిక దాపురించె!
సామాన్యునిగా నేనిక మెలగ జాల!
సాధింతు పరిపూర్ణ ప్రాభవమ్ము!!
సాధింతు పరిపూర్ణ ప్రాభవమ్ము!!
Comments
Post a Comment