నమ్మకం
అన్నానా ?
నన్ను నమ్మమన్నానా?
నిన్ను నమ్మి ఉన్నానా?
నేనన్నది నువు నమ్మితె
నీ నమ్మకమింక నీది!
నీవన్నది నేనమ్మను
నా నమ్మకమొకటె నాది!
నేనన్నది నిజం కాదు!
నీవన్నది నిజంకాదు!
నిజమన్నది ఒక్కటే
నమ్మకమే లేని తనం!
నమ్మితె మోసం! మోసం!
నమ్మితె మోసం! మోసం!
Comments
Post a Comment