తెలుగు టివి యాంకర్
#న్యూస్ #యాంకర్ #TVNews
అడుగులో అడుగేసుకుంటూ అరచి అరచి చెప్తావు!
చెప్పిందే చెప్పి చెప్పి మరొకడితో చెప్పిస్తావు!
మేకప్ లో మెరుస్తావు!
జీన్సు లో జడిపిస్తావు!
కుడినుండి ఎడమకి నడిచి ఏదేదో చెప్తావు!
ఎడమనుండి కుడికి నడిచి తిరిగి అదే చెప్తావు!
మూడు ముక్కల న్యూసు ముఫ్ఫై నిమిషాలు చెప్పి
రొప్పి రొప్పి మరీ రచ్చ చేస్తావు!
అందుకే నీ మీద ఛందస్సు లేని ఒక పద్యం కట్టా! ఇనుకో!
నిన్ను మించు న్యూసు నెరజాణలెవ్వరే!
తెరను వీరవనిత వీవు గాదె!!
యాంకరింగులోన యాంగిల్సు చూపకే
చూడలేక మాకు మతిచలించె!!
Comments
Post a Comment