ఆర్ట్ ఆఫ్ లివింగ్ రైతుకి తెలియదా?
#ArtOfLiving #Raitu
కడుపులో చల్ల కదలకుండా కూర్చున్నవాడు ఆర్టాఫ్ లివింగ్ అంటూ ఎన్నైనా చెప్తాడు..!
గుండె రగిలే కష్టాలు, కడుపు రగిలే నష్టాలు తట్టుకోలేక తల్లడిల్లే రైతు ఆత్మాహుతులను అపాలంటే మార్చాల్సింది రైతును కాదురా పిచ్చి సన్నాసి!!
మార్కెటింగ్ వ్యవస్థలో ఉన్న దుర్మార్గాన్ని!
కల్తీ ఎరువులనూ, విత్తనాల్ని సప్లై చేసే వ్యాపారస్తుల్ని!
వడ్డీ మీద వడ్డీ గుంజుతూ అప్పుల భారం పెంచుతున్న బ్యాంకింగ్ వ్యవస్థని!
జలయజ్ఞం పేరుతో ధన యజ్ఞం చేసుకునే రాజకీయ నేతలని!
పార్టీ గెలుపు కోసం రైతు గీతం పాడే కుహానా పొలిటికల్ పార్టీలని!
రైతు సంక్షేమ నిధులను స్వాహా చేసే అధికార గణాల్ని!
వ్యయం తప్ప సాయం చేయని వ్యవసాయ శాఖామాత్యులని!
ఈ ఘోర కలిని చూస్తూ మౌనం గా ఉన్న జనసామాన్యాన్ని!
ఆకలికి అర్థం తెలియని వాడ్ని!
ఆవేదన లోతులు చూడని వాడ్ని!
చలువరాతి శ్వేతసౌధంలో కూర్చుని ఉపన్యసించటం కాదు!
స్వేదం చిందించి పనిచేసినా ఫలితం పరుల జేబుల్లోకి పోతున్నప్పడు... ఆ ఆక్రోశానికి అడ్డుకట్ట వెయ్యడం ఎవరి తరం???
#ArtOfLiving, #Raitu
Comments
Post a Comment