చరిత్రలో నిలుస్తావు
తల పండితె చాలదోయి!
అనుభవాన్ని పండించు!
వయసుడిగితె చాలదోయి!
బాధ్యతెరిగి వర్తించు!
ధనం మదం, దళం బలం
ప్రదర్శిస్తె చాలదోయి!
పలుకుబడితొ సత్కారం
ప్రహసనం అవుతుందోయ్!
ప్రతిభ దాచి ఉంచిననూ
జనంలోకి పోతుందోయ్!
ప్రవీణులకు సత్కారం
దక్కకుండ పోదోయి!
జీవితానికావలనూ
జీవించే ఉంటావు
గొప్ప పనులు చేసిచూడు
చరిత్రలో నిలుస్తావు!!
Comments
Post a Comment