సంకెళ్ళేసిరి సంకెళ్ళేసిరి

సంకెళ్ళేసిరి! సంకెళ్ళేసిరి!
అన్నదాత రైతన్న చేతులకి!

కల్తీ ఎరువులు అమ్మిన వాణ్ణీ
నకిలీ విత్తనమమ్మిన వాణ్ణీ
అప్పుకు వడ్డీ గుంజిన వాణ్ణీ
ధరలో మోసం చేసిన వాణ్ణీ
కష్టం దోచుకు పోయేవాణ్ణీ
నెత్తిన పెట్టుకు మోసేవాళ్ళు!

సంకెళ్ళేసిరి! సంకెళ్ళేసిరి!
అన్పదాత రైతన్న చేతులకి!

వానల వరదల భీభత్సంలో
కొట్టుకుపోయిన పంటను చూసి
గుండెలు చెరువై ఏడ్చే రైతుకి
రక్షణ నివ్వని బక్షక గణములు!

పంటకు ఖర్చులు పెరుగుతు ఉన్నా
దళారి దండిగ గడిస్తు ఉన్నా
గిట్టబాటు ధర కల్పన చేయక
ఋణాల ఊబిన నెట్టే గణములు!

సంకెళ్ళేసిరి! సంకెళ్ళేసిరి!
అన్నదాత రైతన్న చేతులకి!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు