చిక్కుముడి
చిటపట చినుకుల్లో
తడవాలనుకున్నా
చిటపటలాడే నిన్ను చూసి
ఆ కోరిక మానుకున్నా!
సిరిసిరి మువ్వల సవ్వడితో
ఆడాలని అనుకున్నా
చిరుబురుమనే నిన్ను చూసి
ఆ కోరిక మానుకున్నా!
మిసమిసలాడే నా కన్నులలోకి
రుసరుసలాడుతు నువు చూస్తుంటే
సుడులు తిరిగిన నా కన్నీళ్ళలో
నువ్వు మసక ముద్దౌతున్నావు!
నూలుపోగు దారంతో అల్లుకున్న
బంధం మనది!
ఎక్కడ తెగిపోతుందోననే భయంతో
ఎన్నో ముడులు వేసాను.
వేసినకొలదీ నా స్త్రీ బ్రతుకుకు నువ్వు
చిక్కు ముడివే అవుతున్నావు!!
Comments
Post a Comment