ఒక్కటి చాలు
రాశులు వందున్ననేమి
వాసిగ ఒకటున్న చాలు
కవితలు స్మృతిలో
బాణము లెన్నున్ననేమి
ఛేదించెడి దొకటి చాలు
అమ్మల పొదిలో
హస్తము లెన్నున్ననేమి
ఆదుకొనేదొకటి చాలు
హస్తినపురిలో
వేలకొలది హామీలకు
వేదికవేయుట ఎందుకు
ఫలవంతమైన పథకమొకటి
ప్రజలకు అందితె చాలు!!
Comments
Post a Comment